Header Banner

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో క్రమశిక్షణా రాహిత్యంపై కఠిన చర్యలు! వైద్యులు, సిబ్బందికి సస్పెన్షన్ షాక్!

  Tue Feb 18, 2025 22:35        Politics

రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంత్రి సుభాశ్ ఆదేశాలతో రాష్ట్ర బీమా వైద్య సేవల సంచాలకులు చర్యలను చేపట్టారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ సోమవారం ఆకస్మిక తనిఖీ సమయంలో సంతకాలు చేసి కొందరు వైద్యులు, సిబ్బంది వెళ్లిపోవడాన్ని గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి సుభాశ్ ఆదేశాలతో ఈఎస్​ఐ సిబ్బంది సస్పెన్షన్: విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంత్రి సుభాశ్ సోమవారం ఆసుపత్రి తనిఖీ చేసిన సమయంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌తో పాటు మరో ముగ్గురు డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేరు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


వెంటనే ఈఎస్‌ఐ ఆసుపత్రి నుంచే బీమా వైద్య సేవల సంచాలకులు ఆంజనేయులుతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం లేదా క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఈ సందర్భంగా బీమా వైద్య సేవల డైరెక్టరు ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాజమహేంద్రవరం వైద్యులు, సిబ్బందిపై విధి నిర్వహణ విషయంలో విచారణ జరుగుతోందని, సమగ్ర నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, సత్ప్రవర్తనతో నిర్వహించాలని కోరారు. ఈఎస్‌ఐ పథకం కింద లబ్ధిదారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #rajamundry #hospital #suspension #todaynews #flashnews #latestupdate